Rahul Gandhi : కర్నాటకలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'..

Rahul Gandhi : కర్నాటకలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..
Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటకలో ప్రవేశించింది

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటకలో ప్రవేశించింది. ఇవాళ భారత్‌ జోడో యాత్ర 23వ రోజుకు చేరుకుంది. చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట్‌ వద్ద కర్ణాటకలో ప్రవేశించింది. మోకాలి నొప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నా రాహుల్‌ ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో రాహుల్‌గాంధీకి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు.

23వ రోజు రాహుల్ గాంధీ చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట్‌ లోని ఊటీ-కాలీకట్‌ జంక్షన్‌ నుంచి ఉదయం 9గంటల 35 నిమిషాలకు పాదయాత్ర మొదలైంది. రాహుల్‌ పాదయాత్రకు చామరాజనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ ప్రసంగించారు. ఉదయం 10.35 గంటలకు పంజాహెళ్లిలో మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత స్థానిక శనేశ్వర దేవాలయం దగ్గర కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్‌.

తిరిగి సాయంత్రం ఐదు గంటలకు బెండగెల్లి విలేజ్‌ గేట్‌ నుంచి పాదయాత్ర మొదలై బేగూర్‌ బస్టాప్‌ వరకు కొనసాగనుంది. అక్కడ స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు రాహుల్‌. బేగూర్‌లో 23వ రోజు పాదయాత్ర ముగియనుంది. రాత్రికి బేగూర్‌ విలేజ్‌ గ్రౌండ్‌లో రాహుల్‌ బస చేయనున్నారు.

మరోవైపు భాషలు, సంస్కృతులు, మతాలను గౌరవించుకోవాలన్నారు రాహుల్‌గాంధీ. మోకాలి నొప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతోందని,అయినా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతుంటే ఆ బాధ తెలియడం లేదని అన్నారు.రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి

తెలుసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story