Bharat Jodo Yatra : కేరళలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 13వ రోజు పాదయాత్ర ముగిసింది. ఉదయం చెర్తాలలో ప్రారంభమైన యాత్ర...ఆలూరు జంక్షన్ వరకు దాదాపు 25 కిలోమీటర్లు సాగింది. కేరళలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. రాహుల్‌ను చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటు ముందుకు సాగుతున్నారు రాహుల్.
ఉదయం అలప్పుజ జిల్లా చెర్తాలలో యాత్ర ప్రారంభించారు రాహుల్. 14 కిలోమీటర్లు నడిచిన తర్వాత కుతియాతోడులో బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తర్వాత ఎరమల్లూరు జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆలూరు జంక్షన్ దగ్గర యాత్ర ముగించారు. ఇవాళ కొచ్చి యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్‌లో రాహుల్ బస చేయనున్నారు. పాదయాత్రలో రాహుల్ వెంట సీనియర్ నేతలు మురళీధరన్, పవన్ ఖేరా, వీ.డీ. సతీషన్, షనిమోల్ ఉస్మాన్‌తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.
దేశాన్ని పాలిస్తున్న వారు ద్వేషాన్ని పెంచుతు ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. వారి ప్రసంగాల్లో ప్రేమ, మానవత్వం ఎక్కడా కనిపించదన్నారు. ద్వేషం, కోపంతో కూడుకున్న పాలకులు ఉంటే ఏ దేశం అభివృద్ధి చెందదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com