Rahul Gandhi : చిన్నారులతో కలిసి రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

Rahul Gandhi : చిన్నారులతో కలిసి రాహుల్ భారత్ జోడో యాత్ర
Rahul Gandhi : రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఐదోరోజు కొనసాగుతోంది

Rahul Gandhi : రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని తిరువనంతపురం జిల్లా పారసాల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 19 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఇవాళ ఉరుత్తుకల, నెమోమ్‌ మీదుగా పట్టోం వరకు దాదాపు 40కిలోమీటర్లు రాహుల్‌ నడవనున్నారు. రాత్రి పట్టోంలోని సెయింట్ మేరీస్‌ స్కూల్‌లో రాహుల్ బస చేస్తారు. కేరళలో దాదాపు ఏడు జిల్లాల మీదుగా త్రిస్సూర్ వరకు యాత్ర జరుగుతుంది. మొత్తం 12 రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర సాగుతుంది. దాదాపు 150 రోజుల పాటు 3 వేల 500 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది.

యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో సమావేశమవుతూ ముందుకుసాగుతున్నారు రాహుల్. ఇవాళ ఓ చిన్నారని ఎత్తుకుని సంబరపడిపోయారు రాహుల్. అలాగే వారికి సెల్ఫీలిస్తూ... వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఇక చాలామంది పిల్లలు జాతీయ జెండా పట్టుకుని రాహుల్‌ అడుగులో అడుగేస్తున్నారు.

ఇక రాహుల్‌ యాత్రలో నిన్న ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story