Rahul Gandhi : 18 రోజుల్లో 400ల కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi : రాహుల్ గాంధీ 18వ రోజు జోడో యాత్ర కాసేపట్లో ముగియనుంది. రాహుల్ పాదయాత్ర వెట్టికట్టిరి సమీపానికి చేరుకుంది. వెట్టికట్టిరిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఇక్కడితో 18వరోజు పాదయాత్ర పూర్తి కానుంది. అనంతరం త్రిసూర్ జిల్లా చెరుతుర్తిలోని జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో రాహుల్ గాంధీ స్టే చేయనున్నారు.
వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ వెంట సాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె. మురళీధరన్, కెసి వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, ప్రతిపక్ష నేత, విడి సతీశన్, జిల్లా ఎంపీలు తదితరులు రాహుల్ వెంట నడుస్తున్నారు.
వడక్కంచెరిలో విరామ సమయంలో రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలిశారు. నిరుద్యోగ సమస్య, ఉపాధి హామీ లేమి తదితర సమస్యలపై స్థానిక యువత రాహుల్ గాంధీకి వివరించారు. దేశంలో అధిక వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వందలాది మంది పార్టీ కార్యకర్తలతో జోడో యాత్రలో పాల్గొన్నారు.
యాత్రలో పలు సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు రాహుల్. యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో 1000 రూపాయలకు పెంచారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఇప్పటికే భారత్ జోడో యాత్ర 400 కిలోమీటర్ల మార్క్ దాటింది. సెప్టెంబర్ 10 సాయంత్రం కేరళలో అడుగుపెట్టిన యాత్ర అక్టోబర్ 1న కర్ణాటకలో ప్రవేశించనుంది. వాయినాడ్ రాహుల్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు పాదయాత్ర ప్లాన్ చేసింది జోడో యాత్ర టీం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com