Rahul Gandhi : 30వ రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

Rahul Gandhi : 30వ రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..
Rahul Gandhi : దేశంలో RSS, BJP విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర..30వ రోజు ముగిసింది

Rahul Gandhi : దేశంలో RSS, BJP విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర..30వ రోజు ముగిసింది. ఇవాళ తుముకూరు జిల్లా తిప్తూర్‌ KB క్రాస్‌ రోడ్‌ నుంచి పొచ్‌కట్టె వరకు పాదయాత్ర సాగింది. రాహుల్ పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది. వేలాది కార్యకర్తలు వెంట రాగా...స్థానికుల సమస్యలు తెలుసుకుంటు..వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్. ఇక రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు, ఆయనకు కరచాలనం ఇచ్చేందుకు జనం ఎగబడుతున్నారు.

ఉదయం KB క్రాస్‌ రోడ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగించారు రాహుల్ గాంధీ. స్థానిక కాంగ్రెస్ నేతలు రాహుల్ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. తర్వాత చిక్కనాయకనహళ్లి కనకభవన దగ్గర యాత్రకు బ్రేక్ ఇచ్చారు. విరామ సమయంలో స్థానిక చిరువ్యాపారులు, కొబ్బరి వ్యాపారులతో రాహుల్ ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక రాత్రికి తుమకూరు జిల్లా పొచ్‌కట్టెలో రాహుల్ రాత్రికి బస చేస్తారు.

సెప్టెంబర్‌ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ భారత్‌ జోడో యాత్ర..ఇవాల్టికి 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తమిళనాడు, కేరళల మీదుగా కర్ణాటకలో ప్రవేశించింది.150 రోజుల పాటు దాదాపు 12 రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర సాగనుంది. మొత్తం 3 వేల 500 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story