Bharat Jodo Yatra : ఫుల్ జోష్‌గా సాగిన రాహుల్ 'భారత్ జోడో యాత్ర' 12వ రోజు..

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 12వ రోజు పూర్తయింది. ఇవాళ అలప్పుజ జిల్లాలోని పున్నప్రా నుంచి మైకెల్ కాలేజీ వరకు యాత్ర కొనసాగింది. దారి పొడవునా యాత్రకు విశేష స్పందన లభించింది. రాహుల్‌ను చూసేందుకు చిన్నాపెద్ద ఆసక్తి చూపారు. యాత్రలో భాగంగా స్థానికుల సమస్యలు వింటూ భరోసా ఇస్తూ ముందుకు కదిలారు రాహుల్ గాంధీ. రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం మత్స్యకారులతో సమావేశమైన రాహుల్...వారి సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు.
కలవూర్ కెమ్లాట్ కన్వెన్షన్ దగ్గరకు చేరుకున్నాక బ్రేక్ తీసుకున్నారు. పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసింగ్‌లో పాల్గొన్నారు రాహుల్. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఇలాంటి పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు రాహుల్. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. తర్వాత తిరిగి పాదయాత్ర నిర్వహించారు. ఇవాళ మొత్తం 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు రాహుల్. రాత్రికి సెయింట్ మైకెల్ కాలేజీలో బస చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com