Rahul Gandhi : ఫుల్ జోష్‌లో కొసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..

Rahul Gandhi : ఫుల్ జోష్‌లో కొసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..
Rahul Gandhi : దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర...ఉత్సాహంగా సాగుతోంది

Rahul Gandhi : దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర...ఉత్సాహంగా సాగుతోంది. స్థానికుల నుంచి భారత్‌ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తోంది. అనేక మంది రాహుల్‌ గాంధీ అడుగులో అడుగు వేస్తు ముందుకు కదులుతున్నారు. రాహుల్‌ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం బారులు తీరుతున్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ వారిలో భరోసా నింపుతూ ముందుకుసాగుతున్నారు రాహుల్ గాంధీ. శుక్రవారం యాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ....శనివారం త్రిస్సూర్ జిల్లా పెరంబ్రా జంక్షన్‌ నుంచి యాత్ర ప్రారంభించారు.

పెరంబ్రా జంక్షన్‌ నుంచి 12 కిలోమీటర్ల పాదాయాత్ర తర్వాత అంబల్లూరు జంక్షన్‌ దగ్గర బ్రేక్ తీసుకున్నారు రాహుల్. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు తాలోర్‌ బైపాస్ జంక్షన్‌ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సాయంత్రం వడక్కుంనాథన్‌ సౌత్‌ గేట్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. స్వరాజ్‌ రౌండ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో విద్వేష రాజకీయాలను కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పెంచి పోషిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పురోగతి ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు.

ఇక సెప్టెంబర్‌ 7న కన్యకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమవగా...ఇప్పటివరకు దాదాపు 350 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయింది. కేరళలో ఓవరాల్‌గా 7 జిల్లాల్లో సాగనున్న భారత్ జోడో యాత్ర...సెప్టెంబర్‌ 30న కర్ణాటకలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలో కొనసాగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్. అందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కర్ణాటక కాంగ్రెస్ చేసిన ఏర్పాట్ల పట్ల AICC సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story