Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీచులాటలు.. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ..

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీచులాటలు.. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ..
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది.

Karnataka: అసలే దేశంలో కాంగ్రెస్ కు గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో నేతల మధ్య కీచులాటలు, అంతర్గత తగాదాలు పార్టీని మరింత భ్రష్టు పట్టిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. మాజీసీఎం సిద్ధరామయ్య, కర్టాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకేశివకుమార్.. నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం నడిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకకు వచ్చిన రాహుల్ గాంధీ ఇద్దరి నేతలపై గరం అయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్లతో ప్రత్యేకంగా భేటైన రాహుల్.. బీజేపీని గద్దె దించడమే ధ్యేయంగా పని చేయాలంటూ సీనియర్లకు హితబోధ చేశారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలను ప్రజావేదికల్లో చర్చించకూడదని రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌ మొత్తం కలిసి కట్టుగా 2023 ఎన్నికల కోసం పోరాడాలన్నారు. ఇంటా-బయట పార్టీ వ్యవహారాల గురించి భిన్న గొంతుకలు వినిపించకండని నేతలను హెచ్చరించారు రాహుల్. అయితే ఎలాంటి విభేదాలు లేవని ఇదంతా మీడియా చేస్తున్న హడావిడినే అని ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ చెప్పుకచ్చారు. కర్ణాటక రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. సంస్థాగత వ్యవహారాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై చర్చలు జరిగాయి 2023 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

కర్నాటకలో కాంగ్రెస్ తికమక పెట్టినట్లు కనిపిస్తున్నందున రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అది పేలిపోతుందనే భయంతో పార్టీలో చాలా మంది ఉన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా.. రాహుల్‌ గాంధీ చిత్రదుర్గలోని మురుగమఠ్‌ను సందర్శించారు. కర్ణాటక ఓటు బ్యాంకింగ్‌లో లింగాయత్‌లకు 17 శాతం వాటా ఉండగా.. దానిని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో రాహుల్‌ ప్రధాని అవుతారంటూ మఠాధిపతి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Tags

Read MoreRead Less
Next Story