Rahul Gandhi : నిర్ణయాలు తీసుకోవడంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది : రాహుల్ గాంధీ

X
By - Sai Gnan |8 Oct 2022 7:30 PM IST
Rahul Gandhi : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇద్దరికి వారి సొంత అభిప్రాయాలున్నాయని చెప్పారు
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా నిర్ణయాలు తీసుకోవడంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. గెలిచిన వారు రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు అవుతారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇద్దరికి వారి సొంత అభిప్రాయాలున్నాయని చెప్పారు. రిమోట్ కంట్రోల్ అని పిలవడం అంటే వారిద్దరిని అవమానపరచడమేనన్నారు. దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. సీనియర్ లీడర్లు మల్లి ఖార్జన ఖర్గే..శశి థరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com