Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి..

Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి..
X
Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. భారతీయ సమాజంలో హింస – అహింస అనే అంశంపై ఎదురైన ప్రశ్నకు రాహుల్ తడుముకొంటున్నట్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు రాహుల్ కొంత సమయం తీసుకున్నారు. ఈ విషయంలో మొదట తనకు గుర్తొచ్చే పదం క్షమాపణ అని.. ఇది కచ్చితమైందేమీ కాదంటూ సమాధానమిచ్చారు.

దాంతో అక్కడ చప్పట్లు మోగాయి. దీనిపై సమాధానం చెప్పేందుకు ఆలోచిస్తున్నా అని రాహుల్ అనగా.. ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని.. ఇంతకుముందెవ్వరూ మిమ్మల్ని ఇటువంటి ప్రశ్న అడిగి ఉండకపోవచ్చని రాహుల్‌కు యాంకర్‌ క్షమాపణలు చెప్పారు. దానికి బదులుగా ఇదేం పెద్ద ఇబ్బంది కాదని.. కాకపోతే మీకు వివరంగా సమాధానం ఇచ్చేందుకు ఆలోచించుకుంటున్నానని కాంగ్రెస్ నేత బదులివ్వడంతో డిబేట్‌ చిరునవ్వులతో ముగిసింది.

Tags

Next Story