Rahul Gandhi : ఇప్పుడు రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటి..?

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఐరోపా పర్యటన ఇంటాబయట రచ్చ అవుతోంది. సాధారణంగా ఛాన్స్ దొరికితే చాలు.. రాహుల్‌పై అధికార పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఆరోపణలు గుప్పిస్తారు. కానీ ఇపుడు సొంతపార్టీ నాయకులే రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈనెల 21న సోనియాగాంధీ విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అంతకంటే ముందు 18న రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. అలాగే త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
ఇక ప్రధానంగా గురువారం కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. గోవాలో కాంగ్రెస్‌కు ఫిరాయింపులు వెంటాడుతున్నాయి.కేంద్ర రాజకీయాలు హాట్‌గా సాగుతున్నాయి.
ఇన్ని కీలక పరిణామాలు ఉండగా.. వీటన్నింటిని వదిలేసి రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్.. ఐరోపాకు వెళ్లడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com