Rahul Gandhi: ఖాట్మండులో చైనా రాయబారిని కలిసిన రాహుల్ గాంధీ..!

Rahul Gandhi: రాహుల్ గాంధీ చైనా రాయబారిని నేపాల్ రాజధాని ఖాట్మండులో కలిశారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. ఖాట్మండులోని ఓ పబ్‌లో రాహుల్‌గాంధీ ఉన్న వీడియో కూడా బయటికొచ్చింది. ఖాట్మండు పోస్ట్ పత్రిక ఈ వివరాలను బయటపెట్టింది. రాహుల్‌గాంధీ నిన్ననే ఖాట్మండు వచ్చారని, ఐదు రోజుల పాటు నేపాల్‌లోనే ఉంటారని కథనం కూడా ఇచ్చింది. దీంతో నేషనల్ మీడియాలోనూ ఈ వార్త సెన్సేషన్ అవుతోంది.
రాహుల్ గాంధీ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నేపాల్‌కు వెళ్లారు. మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా చేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె వివాహానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎన్‌లో కరెస్పాండెంట్‌గా చేసిన సుమిన్న ఉదాస్‌తోనూ రాహుల్‌గాంధీకి పరిచయం ఉండడంతో ఈ పెళ్లికి నేపాల్ వెళ్లారు ఈ వివాహ వేడుకకు చైనా రాయబారితో పాటు పలు దేశాల నేతలు కూడా వెళ్లారని, అందులో భాగంగానే రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలిసి ఉండొచ్చని చెబుతున్నారు.
రాహుల్ నేపాల్‌టూర్‌పై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. రాహుల్ నేపాల్ లో జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైతే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నాయి. కావాలనే బీజేపీ నేతలు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. పెళ్లికి పిలుస్తే రాహుల్ నేపాల్ వెళ్లారు తప్ప.. ప్రధాని మోదీలా పిలవకుండా పాకిస్థాన్ వెళ్లలేదని రణదీప్ సూర్జేవాలా సైటైర్ వేశారు. బీజేపీ కావాలనే విమర్శిస్తుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com