Rahul Gandhi: రాహుల్‌గాంధీ పొలం బాట...

Rahul Gandhi: రాహుల్‌గాంధీ పొలం బాట...
హరియాణలో అకస్మాత్తుగా రాహుల్‌ పొలంబాట... వరి నాట్లు వేసి, ట్రాక్టర్‌తో పొలం దున్నిన కాంగ్రెస్‌ అగ్ర నేత... రైతులతో కలిసే భోజనం....



దిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా హరియాణాలో ఆగి.. ఓ పొలంలో వరినాట్లు వేశారు. సోనిపత్‌ జిల్లాలోని మదీనా గ్రామంలో దిగిన రాహుల్‌.. అక్కడ వరినాట్లు వేస్తున్న రైతులను చూశారు. ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం పొలంలో ట్రాక్టర్‌ నడిపారు. ప్యాంటు మడతపెట్టి, బూట్లు చేతిలో పట్టుకుని బురదలో దిగారు. రైతులతో కలిసి వరినాట్లు వేశారు. మహిళా కూలీలు తమతోపాటు తెచ్చుకున్న భోజనాన్ని ఆయనకూ వడ్డించారు. రాహుల్‌ దాదాపు రెండు గంటలు ఆ గ్రామంలోనే ఉన్నారు.



Tags

Next Story