RAHUL: బిలియనీర్ల చేతిలో మోదీ కీలుబొమ్మ

RAHUL: బిలియనీర్ల చేతిలో మోదీ కీలుబొమ్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు... మోదీని 21వ శతాబ్దపు రాజుగా అభివర్ణించిన రాహుల్

బిలియనీర్ల చేతిలో ప్రధాని నరేంద్రమోదీ కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా ...రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిమండలి, పార్లమెంటు, రాజ్యాంగంతో ఆయనకు సంబంధం లేదని రాహుల్ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. మోదీని 21వ శతాబ్దపు రాజుగా అభివర్ణించిన రాహుల్ ...అధికారం మాత్రం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల వద్ద ఉంటుందని విమర్శించారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్ కు టెంపోల్లో డబ్బులు అందుతున్నాయని... ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించగా అందుకు సమాధానంగా లక్నోలో చేసిన ప్రసంగాన్ని రాహుల్ ఎక్స్ లో పోస్టు చేశారు.

50 సీట్లు కూడా రావు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు.హస్తం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదని ఆయనఅన్నారు. కందమాల్ లోక్ సభ స్థానం పరిధిలోని ఫుల్ బానీలో..ప్రధాని ఎన్నికల ప్రచారం చేశారు. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున... నాటి ప్రధాని వాజ్ పేయీ పోఖ్రాన్ లో అణుపరీక్షలను నిర్వహించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని చెప్పారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందంటూ ప్రతిపక్షాలు సొంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. మోదీ ఆరోపించారు. అయితే.. అణుబాంబు ఎలా నిల్వ చేయాలో తెలియని దుస్థితిలో పాకిస్థాన్ ఉందన్నారు. దాన్ని అమ్ముదామని ప్రయత్నిస్తున్నా.... నాణ్యతపై సందేహాలతో ఎవరూ మందుకురావడంలేదన్నారు. ఒడిషాలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. ఒడిశా భాష, చరిత్ర తెలిసిన పురుషుడు లేదా మహిళ భాజపా ప్రభుత్వంలో ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని మోదీ చెప్పారు.

40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్‌లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్‌ పవర్‌, ఎక్‌నాథ్‌ షిండ్‌తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే కాంగ్రెస్‌లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story