Rahul Gandhi : గుజరాత్‌లో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో కీలక నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా హస్తం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. సోమవారం రాహుల్ గాంధీ పర్యటనకు ఒక్క రోజు ముందే గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. అయితే విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రాహుల్ పర్యటన వేళ యూత్ కాంగ్రెస్ చీఫ్ వాఘేలా పార్టీని వీడటంతో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా సోమవారం రాహుల్ గుజరాత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో బూత్ స్థాయి కార్యకర్తల 'పరివర్తన్ సంకల్ప్' సదస్సులో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఇక, వాఘేలా రాజీనామాపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com