Delhi Chalo : మీకు మేమున్నాం : 'ఢిల్లీ చలో' మార్చ్‌లో గాయపడిన రైతుతో రాహుల్

ఢిల్లీ (Delhi) అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద పోలీసుల దాడిలో గాయపడిన రైతుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul gandhi) ఫోన్ లో సంభాషించారు. రాజ్‌పురాలోని ఒక ఆసుపత్రిని సందర్శించిన సమయంలో, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ గాంధీ, ఆసుపత్రిలో చేరిన గాయపడిన రైతుకు మధ్య ఫోన్ కాల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాహుల్ ఆందోళన వ్యక్తం చేస్తూ రైతుకు ఎంతమేరకు గాయాలు అయ్యాయో ఆరా తీశారు. రైతు చేతికి, కంటికి సమీపంలో గాయాలయ్యాయి. పోలీసుల చర్యలో గాయపడిన ఇతర నిరసనకారుల గురించి కూడా గాంధీ ఆరా తీశారు.
ఈ పరిణామానికి సంఘీభావం తెలుపుతూ, పోలీసుల చర్యను పూర్తిగా తప్పుని ఖండిస్తూ, రాహుల్ తన మద్దతును రైతుకు హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. వారి కృషిని కొనియాడారు, మేము మీతో ఉన్నామని, చింతించకండని ఓదార్చారు.
అంతకుముందు ఆందోళనకారులపై 'దాడి' జరిగిందని ఆరోపిస్తూ, ఘర్షణలకు కేంద్రమే కారణమని రైతు నాయకులు తెలిపారు. పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా సుమారు 60 మంది నిరసనకారులు గాయపడ్డారని వారు పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీపై చట్టం సహా పలు డిమాండ్ల కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 'ఢిల్లీ చలో' ఆందోళన చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com