RAHUL: రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 23న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో రాహుల్ గాంధీ వీర్ సావర్కర్‌పై నిరాధార ఆరోపణలు చేశారని ఆయన మనవడు పుణె కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసుపై విచారణ జరిపిన పుణె కోర్టు రాహుల్ అక్టోబర్ 23న న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్‌గాంధీ గతంలో ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించటంతో.. రాహుల్ అప్పట్లో ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా భారత్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
మోదీపై విసుర్లు
కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటనను ఉద్దేశిస్తూ.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెడుతూ, రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ.. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాహుల్ అన్నారు. శివాజీ అందించిన సందేశం దేశమంతటికీ వర్తిస్తుందని... ఛత్రపతి, సాహూ మహరాజ్ లాంటి యోధులు లేకపోయి ఉంటే.. నేడు మనకు రాజ్యాంగం ఉండేది కాదని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు.
సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్
మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత, కేటీఆర్‌లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com