Rahul Gandhi: రాహుల్ భారత్ న్యాయ యాత్ర వివరాలివే

Rahul Gandhi:  రాహుల్ భారత్ న్యాయ యాత్ర వివరాలివే
మణిపుర్ నుంచి ముంబయికి..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. "భారత్ న్యాయ యాత్ర" పేరుతో తూర్పు నుంచి పశ్చిమ దిశగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. జనవరి 14 న మొదలయ్యే ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు 6 వేల 200 కిమీమీటర్ల మేర రాహుల్ యాత్ర ఉండనుంది. పాదయాత్ర, బస్సు యాత్ర ఇలా హైబ్రిడ్‌ పద్ధతిలో ఇది సాగనుంది.

రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సుదీర్ఘ యాత్ర చేసిన రాహుల్ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ దిశగా యాత్ర చేయనున్నారు. భారత్ న్యాయ యాత్రపేరుతో రాహుల్ ఈ యాత్ర చేస్తారని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపుర్‌లో జనవరి 14న మొదలై మార్చి 20న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుుందని చెప్పారు. 6 వేల 200 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా ఉండబోయే ఈ యాత్రలోమహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటించనున్నట్లు పేర్కొన్నారు. మణిపుర్‌లో యాత్ర మొదలు పెట్టడానికి గల కారణాన్ని వేణుగోపాల్ వివరించారు. మే 3 న మణిపుర్‌లో మొదలైన ఘర్షణల్లో 200లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని... వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలిపోయారని పేర్కొన్నారు. మణిపుర్ గాయాలను చెరిపివేసేందుకే ఆ రాష్ట్రాన్ని యాత్ర మొదలు పెట్టడానికి ఎంచుకున్నట్టు వేణుగోపాల్ తెలిపారు.


మణిపుర్‌ నుంచి మొదలయ్యే "భారత్‌ న్యాయ యాత్ర “.. నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్‌ యాత్ర జరుగనుంది. పాదయాత్ర, బస్సు యాత్ర ఇలా హైబ్రిడ్‌ పద్ధతిలో భారత్‌ న్యాయ యాత్ర సాగనుంది.

భారత్ జోడో యాత్రలో ఆర్థిక అసమానతలు, సమాజాన్ని విభజించడం, నియంతృత్వ సమస్యలను రాహుల్ లేవనెత్తగా న్యాయ యాత్ర ద్వారా దేశ ప్రజల సామాజిక, ఆర్థిక ,రాజకీయ న్యాయంపై దృష్టి పెట్టనున్నారని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనవరి 14న ఇంఫాల్‌లో జెండా ఊపి రాహుల్‌గాంధీ యాత్రను ప్రారంభించనున్నారు. గతేడాది సెప్టెంబరు 7న రాహుల్‌ గాంధీ.. భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. దాదాపు ఐదు నెలల పాటు 4వేల 500కిలోమీట్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. జనవరి 30న కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసి దీనిని ముగించారు. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నారు

Tags

Read MoreRead Less
Next Story