Manipur Violence: రాహుల్ మణిపూర్ పర్యటనపై భాజపా విమర్శలు

గత నెలలో మణిపూర్‌లో అల్లర్లు చెలరేగడంతో అప్పటినుంచి ఆ రాష్ట్రం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ జూన్ 29, ౩౦ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఇంఫాల్, చురచంద్‌పూర్‌లలో పర్యటించి అక్కడ ఉన్న సహాయ శిబిరాలను సందరర్శించనున్నారు. అనంతరం అక్కడి ప్రజాసంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు.
రాహుల్ గాంధీ పర్యటనపై భాజపా నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆయనవి అవకాశవాద రాజకీయాలుగా వర్ణించారు.
భాజపా ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ స్పందిస్తూ.. 2015-2017 సంవత్సరాల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీ సింగ్ ప్రభుత్వం మణిపూర్ ప్రజా రక్షణ చట్టం, మణిపూర్ షాప్స్ ఏర్పాటు బిల్లు, మణిపూర్ ల్యాండ్, రెవెన్యూ సంస్కరణలు వంటి 3 బిల్లులను తేవాలనుకున్న సమయంలో వాటికి వ్యతిరేకంగా జాతి హింస చెలరేగింది. అప్పటి జాతి హింస బాధితులను కలవడానికి రాహుల్‌గాంధీ ఆ మధ్య కాలంలో ఒక్కసారి కూడా అక్కడ పర్యటించలేదని గుర్తు చేశాడు. ఆ ఘటనలో యువకులను కాల్చి చంపారు. న్యాయం కోసం వారి దహనసంస్కారాలు 2 సంవత్సరాల పాటు నిర్వహించకుండా నిరసన చేపట్టారని గుర్తుచేశాడు.
"ఆ 2 యేళ్ల కాలంలో మణిపూర్‌లో పర్యటించని రాహుల్ గాంధీ, ఇప్పుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలను ఇంకా పెంచాలనుకుంటున్నాడు " అని వెల్లడించారు.
ఈ నెలలో అమిత్ మాలవీయ రాహుల్ గాంధీ ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలతో ఒక ట్వీట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరుకునపెట్టేలా, రాహుల్‌గాందీ, తన చుట్టూ ఉన్న వాల్లు భారతదేశాన్ని విదేశాల్లో అపఖ్యాతి పాలు చేయిస్తున్నారు అంటూ ట్వీట్‌లో ఆరోపణలు చేశాడు. అయితే ఈ ట్వీట్, వ్యాఖ్యలపై బెంగళూరులో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత రమేష్ బాబు ఫిర్యాదు మేరకు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com