Rahul Gandhi: విచారణకు హాజరు కాలేనన్న రాహుల్ గాంధీ.. ఈడీకి లేఖ..

X
By - Divya Reddy |16 Jun 2022 9:24 PM IST
Rahul Gandhi: శుక్రవారం నాటి తన విచారణను వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీ ఈడీ అధికారులను కోరారు.
Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం నాటి తన విచారణను వాయిదా వేయాలంటూ రాహుల్ గాంధీ ఈడీ అధికారులను కోరారు. తన తల్లి సోనియాగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఈ నెల 20 వ తేదీకి తన విచారణను వాయిదా వేయాలంటూ రాహుల్ ఈడీ అధికారులను కోరారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈడీ మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించింది. గురువారం విచారణకు విరామం ఇచ్చారు. శుక్రవారం నాలుగో రోజు విచారణ జరగాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com