IMD Warning: ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు

IMD Warning: ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు

ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలతో సహా ఇతర రాష్ట్రాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇక గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇక జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.

ఉత్తర పాకిస్తాన్, దాని పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story