Rajasthan:'నన్ను అమ్మా అని పిలిచేవాళ్లు లేరు': పాఠశాల విషాదంలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఒక తల్లి రోదన.

Rajasthan:నన్ను అమ్మా అని పిలిచేవాళ్లు లేరు: పాఠశాల విషాదంలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఒక తల్లి రోదన.
X
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 6 మరియు 7 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉదయం ప్రార్థనలకు హాజరవుతుండగా, భవనంలోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయి 35 మందికి పైగా పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఏడుగురు పిల్లలు మరణించారు.

కొద్ది రోజుల క్రితం, పిప్లోడ్ గ్రామంలోని ఓ ఇంటి ప్రాంగణం ఇద్దరు తోబుట్టువుల అల్లరి, ఆట పాటలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇద్దరు చిన్నారు అమ్మకి టాటా చెప్పి చదువుకునేందుకు బడికి వెళ్లారు.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు..

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో శుక్రవారం జరిగిన విషాదకరమైన పాఠశాల భవనం కూలిపోయిన ఘటనలో మరణించిన ఏడుగురు విద్యార్థులలో తన ఇద్దరు పిల్లలు - 12 ఏళ్ల మీనా మరియు ఆరేళ్ల కన్హా - మరణించినందుకు వారి తల్లి ఇప్పటికీ షాక్‌లోనే ఉంది. గుండెలవిశేలా రోదిస్తోంది.

"నేను అన్నీ కోల్పోయాను... నా ఇల్లు ఖాళీగా ఉంది. ప్రాంగణంలో ఆడుకోవడానికి ఎవరూ లేరు. నా బిడ్డలకు బదులుగా దేవుడు నన్ను తీసుకెళ్లి ఉంటే బాగుండేది" అని ఆ తల్లి విలపిస్తోంది.

6 మరియు 7 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థనలకు హాజరవుతుండగా, భవనంలోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయి 35 మందికి పైగా పిల్లలు శిథిలాల కింద సమాధి అయ్యారు. 28 మంది గాయపడగా, ఏడుగురు పిల్లలు - మీనా, కన్హా, పాయల్, ప్రియాంక, కుందన్ (మొత్తం 12 సంవత్సరాలు), ఎనిమిదేళ్ల హరీష్, కార్తీక్ - ప్రాణాలు కోల్పోయారు.

ఈ హృదయ విదారక సంఘటన మధ్య, నిర్లక్ష్యం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూలిపోవడానికి ముందు ఉపాధ్యాయులు పిల్లలను లోపల వదిలి బయటకు వెళ్లారని దుఃఖిస్తున్న ఒక తల్లి ఆరోపించింది. "ఉపాధ్యాయులు బయట ఏం చేస్తున్నారు? పిల్లలను ఎందుకు ఒంటరిగా వదిలేశారు?" అని ఆమె అడిగింది.

ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. ఐదుగురు పాఠశాల సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభతుత్వం హామీ ఇచ్చింది. గ్రామంలో కొత్త పాఠశాల నిర్మాణం చేపడతామని చెప్పారు.

పాఠశాలలో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానికులలో ఆగ్రహం రేకెత్తింది. SRG ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల పని తీరును ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story