అన్నకు ప్రేమతో.. కిడ్నీ దానం చేసిన చెల్లెళ్లు

అన్నకు ప్రేమతో.. కిడ్నీ దానం చేసిన చెల్లెళ్లు
రక్షా బంధన్ సందర్భంగా రాజస్థాన్ వ్యాప్తంగా పలువురు సోదరీమణులు తమ కిడ్నీలను దానం చేసి తమ సోదరుల ప్రాణాలను కాపాడారు.

రక్షా బంధన్ సందర్భంగా రాజస్థాన్ వ్యాప్తంగా పలువురు సోదరీమణులు తమ కిడ్నీలను దానం చేసి తమ సోదరుల ప్రాణాలను కాపాడారు. మూత్రపిండ వైఫల్యంతో పోరాడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి అతని సోదరి జీవితాన్ని బహుమతిగా ఇచ్చింది. బతకాలంటే కిడ్నీ మార్పిడి అవసరమని డాక్టర్లు చెప్పడంతో అతడి సోదరి ప్రాణ రక్షకురాలైంది. రక్షా బంధన్ సందర్భంగా మంగళవారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోదరి తన కిడ్నీని దానం చేసింది.

శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సూరజ్ గోదారా మాట్లాడుతూ, “'సోదరీ, సోదరుల మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. రక్షా బంధన్ నాడు, సోదరులు, సోదరీమణులు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ ఇది ఒక సోదరి తన సోదరుడికి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి. సోదరుని ప్రాణాన్ని నిలబెట్టింది. ఇంతకంటే విలువైన బహుమతి సోదరునికి ఇచ్చేందుకు తన దగ్గర ఏం ఉంటుంది అని ఆ అన్నాచెల్లెళ్ల ఆప్యాయతను కొనియాడారు.

చాలా మంది సోదరీమణులు తమ సోదరులకు కిడ్నీలు దానం చేస్తారని డాక్టర్ తెలిపారు. గత వారంలో కనీసం మూడు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు చేశామని ఆయన చెప్పారు.ఒక రైతు యొక్క ముగ్గురు సోదరీమణులు తమ అన్న జీవితాన్ని కాపాడటానికి వారి కిడ్నీలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. అతను అప్పటికే డయాలసిస్‌లో ఉన్నాడు. కిడ్నీ మార్పిడి అవసరం అని డాక్టర్ చెప్పారు. ముగ్గురు సోదరీమణులలో ఒకరిది అతడికి సరిపోతుందని తేలింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేసారు..

సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్ సీనియర్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి అయిన డాక్టర్ ధనంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, “85 శాతం కిడ్నీ దానాలలో, కుటుంబంలోని పురుషులకు కిడ్నీలను దానం చేసేది మహిళలే అని తెలిపారు. చాలా వరకు కిడ్నీ మార్పిడి అక్కచెల్లెళ్లు, భార్యలు, తల్లుల వల్లే జరుగుతున్నాయి అని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story