Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..?- రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్

బాధ్యతలేని, దుష్ట పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ఎంత వరకు క్షేమం అని ప్రపంచ దేశాల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్‌లో ఇవాళ ఆయన మాట్లాడారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉండడం ఎంత వరకు సమంజసం అని రాజ్‌నాథ్ అడిగారు. అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ .. పాకిస్థాన్ అణ్వాయుధాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన దాడిలో.. కిరానా హిల్స్ సమీపంలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ను భారతీయ వైమానిక దళాలు దాడి చేశాయి. అయితే ఆ ఎయిర్‌బేస్ వద్ద న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను పాకిస్థాన్ దాచిపెట్టినట్లు తెలుస్తోంది. దాడి జరగడం వల్ల ఆ న్యూక్లియర్ వార్‌హెడ్స్ నుంచి అణుధార్మికత రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ పర్యటనలో రక్షణ మంత్రి తన ప్రసంగంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు.
పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజల్లో పాకిస్థాన్, ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం అయ్యిందని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని, శుత్రవులను నాశనం చేసిన శక్తి ఇక్కడ ఉందని, పాకిస్థానీ చౌకీలు, బంకర్లను ధ్వంసం చేసిన తీరుతో శత్రుదేశం షాక్‌కు గురైందన్నారు. కిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ మీతో ఉండడం గర్వంగా భావిస్తున్నానని, ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు చేసిన పని పట్ల దేశం గర్వంగా ఉందన్నారు. రక్షణ మంత్రి కన్నా ముందు తాను దేశ పౌరుడినని, ఓ మంత్రిగానే కాకుండా, ఓ పౌరుడిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com