Rajya Sabha: దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు రాజ్యసభకు అవకాశం..

Rajya Sabha: బీజేపీ ఆపరేషన్ దక్షిణ్ ప్రారంభించేసింది. దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలని కృత నిశ్చయంతో ఉన్న కమలనాథులు అందుకు తగిన కార్యాచరణ మొదలుపెట్టేశారు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యులుగా నలుగురు దక్షిణాది ప్రముఖులకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉష, కర్ణాటక నుంచి ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసింది. పెద్దల సభ.
ఇప్పటికే ఉత్తరాదితో పాటు.. పశ్చిమ, ఈశాన్య, మధ్య భారత ప్రాంతాల్లో బలంగా ఉన్న కమలనాథులు... దక్షిణాదిలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికోసమే ఆపరేషన్ దక్షిణ్ పేరిట వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు.. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పెద్దల సభకు పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com