Rakesh Rana MP Police: మీసం తీసేయను అన్నాడు.. కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు..

Rakesh Rana MP Police: కొంతమందికి ఉండే ఇష్టాలు, అభిరుచులు వేరేవాళ్లకు కాస్త వింతగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే తన మీసాల మీద ఉన్న ఇష్టంతో ఏకంగా పోలీస్ జాబ్‌నే పక్కకు పెట్టేశాడు ఓ కానిస్టేబుల్. ఇలాంటి ఓ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కానిస్టేబుల్ సస్పెన్షన్ లెటర్ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని స్టేట్ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో రాకేశ్ రానా డ్రైవర్‌గా పోస్ట్ అయ్యాడు. కానీ ఉద్యోగంలో చేరిన కొన్ని గంటల్లోనే సస్పెండ్ అయ్యాడు. దానికి కారణం అతడి మీసం. అతడి మీసం ఇతర అధికారులకు ఇబ్బందిగా అనిపిస్తుందని తన పై అధికారి దానిని తీసేయమని కోరాడు. కానీ రాకేశ్ రానా దానికి అంగీకరించలేదు.
తన సస్పెన్షన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాకేశ్ రానా దీనిపై స్పందించాడు. అది తన ఆత్మాభిమానానికి చిహ్నం అన్నాడు. తాను రాజ్‌పుత్ వంశస్తుడని, తన మీసం తనకు గర్వం అని తెలిపాడు. తన పై అధికారి కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను మీసం తీయనందుకు సస్పెండ్ అవ్వలేదని, తన పై అధికారుల మాట విననందుకు సస్పెండ్ అయ్యాడని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com