Ram Temple: రాములోరి వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య

కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర(Ram Temple) ప్రారంభోత్సవం 2024 జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. దీనికి సమయం దగ్గర పడుతుండడంతో అయోధ్య(AYODHYA) లో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా( Work In Full Swing) జరుగుతున్నాయి. నగరాన్ని అభివృద్ధి చేయడానికి యోగి సర్కార్(UP GOVT) ప్రణాళికలు రచించింది. పక్కా ప్రణాళికతో యోగీ సర్కార్( YOGI GOVT) అభివృద్ధి పనులు చేపడుతోంది.
అయోధ్య(AYODHYA) పరిసరాల్లోని పురాతన ఆలయాలు, చెరువులు, మఠాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు రామ మందిరంతో పాటు ఇతర పుణ్య స్థలాలు, మఠాలను సందర్శించేలా అధికారులు వాటిని అభివృద్ధి చేస్తున్నారు. అయోధ్య నగర అభివృద్ధికి యోగి సర్కార్ ప్రత్యేకంగా 67 కోట్ల( 67 CRORES) రూపాయలతో బడ్జెట్‌ను కేటాయించింది.
అందులో భాగంగానే 37 పురాతన ఆలయాలు, మఠాలు, చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వాటి కోసమే యోగి సర్కార్ ప్రత్యేకంగా 67 కోట్లతో బడ్జెట్‌ను కేటాయించింది. మెుదటి విడతగా 34 కోట్ల 55 లక్షలను విడుదల చేసింది. అయోధ్య నగర అభివృద్ధి చేసే బాధ్యతను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌కు అప్పగించింది. డిసెంబర్‌లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భక్తులు రామమందిర దర్శనం వరకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పురాతన ఆలయాలు, మఠాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సూర్య కుంద్ చెరువులో లైట్, సౌండ్ షోలను ఏర్పాటు చేశారు. లైట్ షోలో భాగంగా రామాయణాన్ని ప్రదర్శించనున్నారు. సాయంకాల వేళ చెరువు దగ్గర భక్తులు ఆహ్లాదంగా గడిపేందుకు ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంతో పాటు వాటిని పునరుద్ధరించడం ప్రణాళికలో భాగమేనని కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. రామమందిరాన్ని వచ్చే ఏడాది జవవరిలో ప్రారంభించాలని ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com