'రామ్ లల్లా మారిపోయాడు'.. శిల్పి అరుణ్ యోగిరాజ్

ఇది నేను చెక్కిన శిల్పమేనా.. నా చేతుల్లో రూపుదిద్దుకున్న బాల రాముడేనా ఇతడు అని విగ్రహ అలంకరణ పూర్తయిన తరువాత మనసులో అనుకున్నానని చెప్పాడు శిల్పి అరుణ్ యోగిరాజ్. రాముడి విగ్రహాన్ని రూపొందించిన మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్, అయోధ్యలో అలంకార వేడుక తర్వాత రామ్ లల్లా పూర్తిగా భిన్నంగా కనిపించారని చెప్పారు.
విగ్రహం చెక్కుతున్నప్పుడు వివిధ దశలలో భిన్నంగా కనిపించిందని, అలంకరణ తర్వాత రామ్ లల్లా పూర్తిగా భిన్నంగా కనిపించారని అరుణ్ అన్నారు. తాను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు రామ్ లల్లా ఇచ్చిన ఆదేశాలు పాటించానని చెప్పాడు. నా చేత ఆ స్వామియే తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడని చెప్పారు.
రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.. నేను దానిని అనుసరించాను అని యోగిరాజ్ చెప్పాడు. గత ఏడు నెలలుగా విగ్రహాన్ని ఎలా పూర్తి చేయాలనే సవాలు తనకు ఉండేదని వివరించాడు. "చిన్నపిల్లవాడి యొక్క అమాయకత్వాన్ని శిల్పం ప్రతిబింబించాలి. ఐదేళ్ల రాముడి రూపానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విగ్రహం శిల్ప శాస్త్రానికి కట్టుబడి ఉండాలని అనుకున్నానని తెలిపాడు.
రామ్ లల్లా కళ్లు బాగున్నాయా అని తన స్నేహితులను పదే పదే అడిగేవాడినని యోగిరాజ్ పేర్కొన్నాడు. "ఒక రాయిలో భావాలు తీసుకురావడం అంత సులభం కాదు, దానితో మీరు చాలా సమయం గడపాలి. కాబట్టి నేను రాయితో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. పిల్లల లక్షణాలను అధ్యయనం చేశాను. ఆ మేరకే శిల్పం రూపొందించాను. మిగతాదంతా రామ్ లల్లా వల్లే జరిగింది అని వినమ్రంగా చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com