Gita Press: గీతాప్రెస్‌లో రామ్‌చరిత మానస్ పుస్తకాల కొరత

అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం సమీపించటంతో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. భక్తులకు ఆతిథ్యమిచ్చేందుకు నిర్మించిన టెంట్‌సిటీ సర్వంగా సుందరంగా ముస్తాబైంది. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు లడ్డూలు పంపే ఏర్పాట్లలో ప్రముఖ ఆలయాలు నిమగ్నమయ్యాయి. ఉజ్జయినిలోని ప్రముఖ శైవక్షేత్రం మహాకాల్ మందిరం 5 లక్షల లడ్డూలను అయోధ్యకు పంపనుంది. మరోవైపు...రామచరిత మానస్ పుస్తకాలకు కొరత ఏర్పడగా... హనుమాన్ చాలీసా, సుందరకాండ తదితర పుస్తకాలకు డిమాండ్ పెరిగింది.
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చేందుకు నిర్మించిన టెంట్‌సిటీ సిద్ధమైంది. ఈ టెంట్‌సిటీకి...తీర్థక్షేత్రపురంగా నామకరణం చేశారు. మొత్తం 45ఎకరాల విస్తీర్ణంలో తీర్థక్షేత్ర పురాన్ని నిర్మించారు. అందులో 1450 పడక గదులు, 500డార్మెట్రీలు ఉన్నాయి. ప్రతీదానిలో స్నానగదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ తీర్థక్షేత్ర పురంలో రోజుకు 15వేల మంది వరకు బసచేయవచ్చు. టెంట్‌సిటీని 6సెక్షన్లుగా విభజించి ఒక్కో సెక్షన్‌కు ఓ వంటశాలను ఏర్పాటు చేశారు. ఉచిత భోజనం అందించనున్నారు. రామాలయం ప్రారంభోత్సవం తర్వాత నెలరోజులపాటు ఈ తీర్థక్షేత్ర పురం అందుబాటులో ఉంటుంది.
అయోధ్యకు తరలివచ్చే భక్తులకోసం ప్రసాదాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తిరుమల నుంచి లక్ష లడ్డూలు అయోధ్యకు రానుండగా...ఉజ్జయినిలోని ప్రముఖశైవక్షేత్రం మహాకాల్ మందిరం...5లక్షల లడ్డూలు పంపనుంది. ఇందుకోసం 8టన్నుల నెయ్యి, 8టన్నుల శెనగపిండి, పెద్దమొత్తంలో చక్కెర, డ్రైఫ్రూట్స్ వినియోగిస్తున్నట్లు మహాకాల్ ఆలయ కమిటీ తెలిపింది. లడ్డూలను చిన్నడబ్బాల్లో అయోధ్యకు తరలించనున్నట్లు పేర్కొంది.
రామమందిర ప్రారంభ మహోత్సవం దగ్గరపడుతున్న వేళ...దేశంలో అయోధ్య రామయ్య కథల పుస్తకాలకు...డిమాండ్ భారీగా పెరిగింది. గత 50ఏళ్లలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోనిగీతాప్రెస్‌లో రామ్‌చరిత మానస్ పుస్తకాల కొరత ఏర్పడింది. గతేడాది వరకు...ప్రతినెలా 75 వేల చొప్పున రామ్‌చరిత మానస్ పుస్తకాల విక్రయాలు జరగ్గా...
ఈ ఏడాది 2వారాల్లోనే లక్ష పుస్తకాలు అమ్మినట్లు...గీతాప్రెస్ నిర్వాహకులు తెలిపారు. సుందరాకాండ, హనుమాన్ చాలీసా తదితర పుస్తకాల అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెప్పారు. మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనీ అప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని...గీతాప్రెస్ అంచనా వేసింది. రామ మందిరం ప్రారంభ మహోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఇచ్చేందుకు గీతాప్రెస్...10వేల అయోధ్య దర్శన్ పుస్తకాలను రామ జన్మభూమి తీర్థట్రస్టుకు పంపించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com