Magsaysay Award: జపాన్ యానిమేటర్కు రామన్ మెగసెసె అవార్డు

ఆసియన్ నోబెల్ ప్రైజ్‌గా భావించే రామన్ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికిగానూ ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావో మియాజాకీని వరించింది. ఆయన స్పిరిటెడ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందారు. మరో ముగ్గురు వ్యక్తులకు, ఒక సంస్థకు ఈ అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తామని అవార్డు నిర్వాహక కమిటీ తెలిపింది. వియత్నాం డాక్టర్ న్గుయెన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంట్‌షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్‌కు అవార్డు లభించింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు కూడా పురస్కారం దక్కింది. ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. యానిమేటర్ హయావో మియాజాకీ యానిమేషన్స్ పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఆనందాన్ని ఇస్తాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com