Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌ను 10 కోట్లు ఇవ్వాలని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh)కు బెదిరింపులు వచ్చాయి. 10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది.అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి వాయిస్ నోట్ రూపంలో బెదిరింపు వచ్చిందని ఓ మీడియా కథనం పేర్కొన్నది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. క్రైం బ్రాంచ్ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. నెంబర్ ఎక్కడిదో కనుక్కొనేందుకు అమెరికా భద్రతా సిబ్బందితో పోలీసులు టచ్‌లో ఉన్నారు.
బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. సాంకేతిక ఆధారాల కోసం అధికారులు వెతుకుతున్నారు. కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు భద్రతను పెంచనున్నారు. గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. ఆ గ్యాంగ్ అనేక మంది సెలబ్రిటీలను బెదిరించిన దాఖాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
