Sukhdev Singh : క‌ర్ణిసేన అధ్య‌క్షుడు కధ ఏంటి ?

Sukhdev Singh : క‌ర్ణిసేన అధ్య‌క్షుడు కధ ఏంటి ?
ఈ హత్య వెనక సినిమాను తలపించే ట్విస్టులు

దేశంలో సంచలనంగా మారిన రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి హత్య కేసులో కీలక విషయాలను వెల్లడయ్యాయి. సుఖ్‌దేవ్‌ హత్యకు ప్రధాన సూత్రదారి.. కెనడాలో నివాసం ఉంటున్నట్లు అనుమానిస్తున్న రాజస్థాన్‌ గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గొదారా అని పోలీసులు భావిస్తున్నారు.సినిమాను తలపించే ట్విస్టులు ఈ హత్య వెనక ఉన్నాయి. ఓ యువతి అత్యాచారం కేసుతో ఈ క్రైమ్‌ కథ మొదలైంది.

దేశంలో సంచలనంగా మారిన రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగామేడి హత్య కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. సుఖ్‌దేవ్‌ను కాల్చిచంపిన దుండగుల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ హత్య వెనుక రాజస్థాన్‌ గ్యాంగ్‌స్టర్‌.రోహిత్‌ గొదారా ప్రధానసూత్రదారిగా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు అనుమానిస్తున్న రోహిత్‌ గొదారాకు లారెన్స్‌బిష్ణోయ్‌, గోల్డీబ్రర్‌ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నాయి. పాత కక్ష్యలతోనే సుఖ్‌దేవ్‌ను.. గొదారా చంపించినట్లు తెలిసింది.

రోహిత్‌గొదారా గతంలో ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు. తనపై అత్యాచారం కేసు నమోదు చేయడంలో సుఖ్‌దేవ్‌ కీలకంగా వ్యవహరించాడని గొదారా భావించాడు. అందుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరతానని భారత్‌లో ఉన్నప్పుడే గోదారా పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అత్యాచారం కేసులో అజ్మీర్‌ జైలులో ఉండగా.. వీరేంద్రచరణ్‌ అనే మరో నేరస్థుడితో గొదారా స్నేహం పెంచుకున్నాడు. ఈ వీరేంద్రచరణ్‌ హత్యలో కీలకపాత్ర పోషించాడు. నితిన్‌ ఫౌజీ, రోహిత్‌ రాథోడ్‌ అనే వ్యక్తులతో తన పథకాన్ని అమలు చేశాడు. ఈ హత్య చేస్తే నితిన్‌ఫౌజీకి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని వీరేంద్రచరణ్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. తనకున్న నెట్వర్క్‌తో దుండగులకు తుపాకులు అందేలా వీరేంద్రచరణ్‌ చేశాడు. అనుకున్నట్లే జైపూర్‌లోని సుఖ్‌దేవ్‌ ఇంటికి వెళ్లిన దుండగులు.. ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం తుపాకులను ఓ ప్రదేశంలో పాతిపెట్టినట్లు సమాచారం. కేసులో సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన దిల్లీ,రాజస్థాన్‌ పోలీసులు.. ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇందులో కాల్పులు జరిపిన ఇద్దరు ప్రధాన నిందితులు ఉన్నారు. ఈ హత్య ప్రస్తుతం రాజస్థాన్‌లో భాజపా,. కాంగ్రెస్‌కు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది

Tags

Read MoreRead Less
Next Story