West Bengal : మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్టు

West Bengal :  మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్టు
రేషన్ స్కాం కేసులో...

పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్టు చేసింది. రేషన్ కుంభకోణం కేసులో తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుంది. కోల్ కత్తా శివారులోని సాల్ట్ లేక్ లోని మంత్రి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ గురువారం సోదాలు నిర్వహించింది. అది జరిగిన మరుసటి రోజే మమతా బెనర్జి మంత్రి వర్గ సహకచరుడిని అరెస్టు చేయడం గమనార్హం. రేషనింగ్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మల్లిక్ ను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆయనను అరెస్టు చేసి, ఈడీ అధికారులు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. తాను తీవ్రమైన కుట్రకు బలైపోయానని వ్యాఖ్యానించారు.

రేషన్ పంపిణీలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లిక్ ప్రస్థుతం బెంగాల్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీ నివాసం నుంచి భారీ నగదు రికవరీ తర్వాత ఈడీ అరెస్టు చేసింది. టీఎంసీ బర్భమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ కూడా గతంలో పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మేనల్లుడు, టిఎంసి అధినేత అభిషేక్ బెనర్జీని కూడా ఈడీ చాలా సందర్భాలలో పిలిచి ప్రశ్నించింది.


మంత్రి మల్లిక్ తో సన్నిహిత సంబంధాలున్న ఓ వ్యాపారవేత్తను గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బకిబుర్ రెహమాన్ అనే వ్యాపారికి పలు రైస్ మిల్లులు, హోటళ్లు, బార్లు ఉన్నాయని, అవి షెల్ కంపెనీలుగా పనిచేస్తున్నాయని తెలిపింది. రెహమాన్ అక్రమంగా రూ.50 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ పేర్కొంది. కాగా.. జ్యోతిప్రియ మల్లిక్ ప్రస్తుతం రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. మల్లిక్ గతంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. టీఎంసీకి ఆయన సీనియర్ సభ్యుడిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story