RBI: కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు? క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ..

RBI: కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు? క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ..
RBI: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోను తొలగిస్తున్నారన్న ఊహాగానాలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తోసిపుచ్చింది.

RBI: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోను తొలగిస్తున్నారన్న ఊహాగానాలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పింది. కరెన్సీ నోట్లపై త్వరలో మహాత్మాగాంధీ చిత్రానికి బదులుగా రబీంద్రనాథ్ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం వంటి ప్రముఖుల ఫోటోలతో కొత్త నోట్లను తీసుకొచ్చేందుకు RBI, ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన డిజైన్లు కూడా పూర్తయ్యాయంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ వదంతులు తీవ్ర కలకలం రేపడంతో.. RBI దీనిపై క్లారిటీ ఇచ్చింది. నోట్ల మార్పు , గాంధీజీ ఫోటో మార్పు ప్రతిపాదనలేవీ అసలే లేవని కుండబద్ధలు కొట్టింది.

Tags

Read MoreRead Less
Next Story