Reena Dwivedi: రీనా ద్వివేది.. చూపు తిప్పలేని అందం ఉంది.. కానీ తను హీరోయిన్ కాదు..!

Reena Dwivedi (tv5news.in)
Reena Dwivedi: ప్రస్తుతం నార్త్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఎవరిది అని ప్రతీ రాష్ట్రంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఎన్నికల హడావిడి నడుస్తుండగా.. మరోవైపు పోలింగ్ బ్యూటీగా అందరి చూపు తనవైపు తిప్పుకుంటోంది రీనా ద్వివేది. 2019 ఎన్నికల్లో ఒకసారి తళుక్కున మెరిసన తనను అప్పటినుండి పోలింగ్ బ్యూటీగా గుర్తుపెట్టుకున్నారు నెటిజన్లు. ఇంతకీ తనెవరు..?
రీనా ద్వివేది ఒక పీడబ్యూడీ ఆఫీసర్. తాను మొదటిసారిగా 2019 ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర కనిపించింది. ఎల్లో శారీలో అచ్చం హీరోయిన్‌లాగా ఉన్న తన ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా ఒక్కసారిగా తాను ఫేమస్ అయిపోయింది. అప్పట్లో తాను బిగ్ బాస్ షోకు కూడా వెళ్లాలని ఉందని తన కోరికను బయటపెట్టింది.
ఇప్పుడు మరోసారి ఈ పోలింగ్ బ్యూటీ రీనా ద్వివేది ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తళుక్కున మెరిసింది. ఒకప్పుడు ఎల్లో శారీలో కనిపించి అందరినీ ఆకట్టుకున్న రీనా.. ఒక్కసారిగా తన స్టైల్‌నే మార్చేసింది. వెస్టర్న్ డ్రెస్‌లో అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ విషయంలో అయితే రీనా అందం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com