Uttarakhand : సహజీవనం రిజిస్టర్ చేసుకోవాల్సిందే..

Uttarakhand : సహజీవనం రిజిస్టర్ చేసుకోవాల్సిందే..
6 నెలల జైలు శిక్ష, రూ.25వేలు జరిమానా..

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో (Uttarkhand Assembly) మంగళవారం ఉదయం యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టబడింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ను(UCC) అమలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది ఉత్తరాఖండ్. దీంతో ఆ రాష్ట్రంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రకారం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో(సహజీవనం) ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటూ ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు 6 నెలల జైలు శిక్ష లేదా 25వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి.

లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్న జంట నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యం కూడా పొందగలుగుతారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాలో ఇటువంటి అంశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. యుసీసీలో లివ్ ఇన్ రిలేషన్ పై స్పష్టమైన వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు. చట్ట ప్రకారం మరే ఇతర నిషేధిత సంబంధాల్లో ఉండకూడదు.

లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న ప్రతీ వ్యక్తి ప్రభుత్వ రిజిస్ట్రర్ వెబ్ పోర్టల్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదు కూడా అందజేస్తారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రర్ చేయించుకున్న జంట.. ఆ విషయాన్ని తమ పేరెంట్స్ కు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.

Tags

Next Story