మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు

మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు
మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రెండు తెగల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ నెల 31 వరకు ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు

మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రెండు తెగల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ నెల 31 వరకు ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మణిపూర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. శాంతిభద్రతలపై సమీక్షించనున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 40 మంది చనిపోయారు. మరోవైపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సీఎం బీరేన్‌ సింగ్ ప్రకటించారు. అయితే తిరుగుబాటుదారులను ఉగ్రవాదులగా ప్రకటించడంపై స్థానికులు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.

కొన్నిరోజులుగా మణిపూర్‌ రాష్ట్రాం తగలబడిపోతుంది. రెండు తెగల మధ్య ఆధిపత్యపోరులో ఆ రాష్ట్రం హింసతో అల్లాడిపోతోంది. ఈ అల్లర్లకు పాల్పడుతున్న తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం ఒక్క రోజే 40 మందిని హతమార్చింది. తిరుగుబాటుదారులను మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పోల్చారు. ఎమ్‌-16, ఏకే-47తో ఉగ్రవాదులు సాధారణ పౌరులపై దాడికి దిగుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని, ఇండియన్‌ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నా రు.

ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు తదితర ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది వ్యక్తులు బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారింది. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఇవాళ మణిపుర్‌లో అమిత్‌ షా పర్యటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story