Rekha sharma: ఎన్‌సీడబ్ల్యూ పదవికి రేఖా శర్మ గుడ్‌బై

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పదవి నుంచి మంగళవారం అనూహ్యంగా తప్పుకున్నారు. రేఖా శర్మ ఆగస్టు 7, 2018 నుంచి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2021, ఆగస్టులో మూడేళ్ల పాటు పదవి పొడిగించారు. 2015 నుంచి కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు పదవీలో కొనసాగారు. మంగళవారమే చివరి రోజు అని ఆమె పేర్కొన్నారు.
కరోనా సమయంలో వృద్ధులకు సహాయం చేసేందుకు హ్యాపీ టు హెల్ప్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలు ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నెంబర్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆమె వ్యాఖ్యలు పలుమార్లు వివాదాలకు దారి తీశాయి. ఆ మధ్య కాలంలో యూపీలోని హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో రేఖా శర్మ ప్రవర్తనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీడియోలో ఓ వ్యక్తి ఆమెపై గొడుగు పట్టుకుని వెనుక నడుచుకుంటూ వస్తున్నాడు. రేఖా శర్మ తన స్వంత గొడుగు ఎందుకు మోయలేకపోయిందని సోషల్ మీడియాలో ఎంపీ ప్రశ్నించింది. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2018 ఆగస్టు 7న ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ పదవిలో 7 ఏండ్లు కొనసాగారు. మూడు టర్మ్‌లు చైర్‌పర్సన్‌గా పనిచేయటం తనకెంతో గర్వకారణమని, సుదీర్ఘకాలం కమిషన్‌లో పనిచేసిన తాను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రేఖా శర్మ చెప్పారు. ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ హయాంలో, మణిపూర్‌లో మహిళలపై లైంగికదాడులు, హత్యలపై ఎన్‌సీడబ్ల్యూ పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com