Rekha Singh: ఆర్మీలో చేరిన జవాన్ భార్య.. మరణించిన భర్త కల నెరవేర్చడానికి..

Rekha Singh: ఇండియా నమ్మిన ఎన్నో సూత్రాల్లో ఒకటి 'జై జవాన్.. జై కిసాన్'. దేశం కోసం పాటుపడే రైతులను, జవాన్లను ఎప్పుడూ గౌరవించాలని దీని అర్థం. కానీ సైనికుడిగా మారి సైన్యంలో చేరాలంటే చాలా ధైర్యం కావాలి అంటుంటారు. కానీ ఓ మహిళ మాత్రం సైనికుడిగా సేవ చేస్తూ తన భర్త మరణించిన తర్వాత అతడి స్థానంలోకి తాను వెళ్లి దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది.
సైనికుడి వృత్తి అంటే కత్తి మీద సాము లాంటిది. దేశాన్ని రక్షించే సైనికుల ప్రాణాలకు మాత్రం రక్షణ కరువే. తరచుగా దేశాల మధ్య జరుగుతున్న దాడుల్లో ఎంతోమంది సైనికులు వీరమరణం పొందుతుంటారు. అలాగే 2020 జూన్‌లో జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందారు నాయక్ దీపక్ సింగ్.
దీపక్ సింగ్‌కు పెళ్లయి అప్పటికి ఏడాదిన్నరే అవుతుంది. అయితే తనలాగే తన భార్య రేఖా సింగ్ కూడా ఆర్మీలో ఉండి దేశానికి సేవ చేయాలని దీపక్ కోరుకునేవారట. అందుకే ఆయన కల నెరవేర్చడానికి రేఖా.. తన టీచర్ ఉద్యోగం వదిలి ఆర్మీలో చేరనుంది. ఈ విషయం తెలిసినవారంతా రేఖాను ప్రశంసిస్తున్నారు. మే 28 నుండి చెన్నైలో ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్‌కు ప్రారంభించనుంది రేఖా సింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com