Republic Day: రిపబ్లిక్ డే పరేడ్‌కి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతారని తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన సుబియాంతో జనవరి 25 నుంచి 26 వరకు భారత్‌లో పర్యటిస్తారు.
1950 నుంచి భారతదేశం తన మిత్రదేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 1952, 1953, 1966ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా వేడుకలు నిర్వహించారు.
2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. , 2015లో అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.2016లో ఫ్రెంచ్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే , 2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు వచ్చారు. 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, 2020లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2021, 2022ల్లో కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు. 2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎస్-సిసిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com