Gujarat: బోరుబావిలో పడిన 18 నెలల బాలుడు.. 40 నిమిషాల్లోనే కాపాడిన ఇండియన్ ఆర్మీ..

X
Gujarat: బోరుబావిలో పడి పోయిన 18నెలల చిన్నారిని రక్షించింది రెస్య్కూ టీం. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని దూదాపూర్ గ్రామంలో జరిగింది. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు పని చేస్తున్న పొలంలో శివం అనే బాలుడు ఆడుకుంటూ.. బోరుబావిలో పడిపోయాడు. దీంతో అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. సమయానికి చేరుకున్న రెస్క్యూ టీం.. బాలుడిని ప్రాణాలతో బోరుబావి నుంచి బయటికి తీసుకొచ్చింది. 20-25 అడుగుల లోతులో చిక్కుకున్న శివంను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కేవలం 40 నిమిషాల్లో కాపాడారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
