Chhattisgarh: 104 గంటల పాటు బోరుబావిలో దివ్యాంగ బాలుడు.. మనోధైర్యంతో..

Chhattisgarh: తెలిసీ, తెలియని వయసులో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. అందులోనూ ఆ చీకటికి భయపడి, ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచిన వారే ఎక్కువ. కానీ ఓ దివ్యాంగ బాలుడు మాత్రం 104 గంటలు తన ఊపిరిని బిగపట్టుకొని 60 అడుగుల బోరుబావిలో ఉన్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని మల్కరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల రాహుల్ సాహుకు మానసిక సమస్యలు ఉన్నాయి. అంతే కాకుండా తనకు మాటలు కూడా సరిగ్గా రావు. గత శుక్రవారం సాయంత్రం రాహుల్ ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయాడు. 80 అడుగుల లోతున్న బోరుబావిలో 60 అడుగుల వరకు వెళ్లి చిక్కుకుపోయాడు. మానసిక పరిస్థితి సరిగా లేకపోయినా కూడా తను ధైర్యం మాత్రం కోల్పోలేదు.
ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు రాహుల్‌ను కాపాడడం కోసం రంగంలోకి దిగారు. ముందుగా బోరుబావిలోకి పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్‌ను పంపించారు. ఆ తర్వాత తాడు ద్వారా తనకు జ్యూసులు, పండ్లు అందిస్తూ ఉన్నారు. ఇక 104 గంటలు శ్రమించిన తర్వాత బాలుడిని ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీశారు. బాలుడిని కాపాడినందుకు తన తండ్రి రెస్క్యూ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తన కుమారుడు బలహీనమైన వాడని, కానీ ఇప్పుడు అందరికంటే తానే ధైర్యవంతుడని నిరూపించాడని బాలుడి తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కూడా బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికి అప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. బాలుడిని రక్షించిన తర్వాత రెస్క్యూ టీమ్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
मुख्यमंत्री श्री @bhupeshbaghel की सतत मॉनिटरिंग में @NDRFHQ, #एसडीआरएफ, @CG_Police, भारतीय सेना और @JanjgirDist ने संयुक्त रूप से कर्तव्यनिष्ठा का पालन करते हुए राहुल को बोरवेल से निकालने का दुष्कर कार्य कर दिखाया। यह ऑपरेशन पूरे देश के लिए मिसाल है। छत्तीसगढ़ ने इतिहास रचा है। pic.twitter.com/l5mOuXrL9b
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 14, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com