Delhi: అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

Delhi:  అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
X
పెద్ద ఎత్తున ఇండియా గేట్ దగ్గర నిరసనలు.. అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. స్వచ్ఛమైన గాలి దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్య నివారణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది. తాజాగా వాతావరణం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వందలాది మంది నగర వాసులు రోడ్డెక్కారు ఇండియా గేట్ దగ్గర వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. తక్షణ పరిష్కారం వెతకాలంటూ డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. గాలి నాణ్యత స్థాయిలో 400 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి కార్యకర్తలు, నిరసనకారులు ఇండియా గేట్ వైపు కవాతు చేశారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story