లిఫ్ట్‌లో కుక్కను తీసుకువచ్చిన మహిళ.. చెంపదెబ్బ కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

పెంపుడు జంతువులతో పెద్ద సమస్యే. అందరికీ అవి నచ్చవు. కానీ మూగజీవాలను ప్రేమించే వారు వాటిపై ఈగ కూడా వాలనివ్వరు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. అవి ఏం చేసినా చూసి ముచ్చటపడుతుంటారు. కానీ కొంత మందికి వాటిని చూస్తే అలర్జీ. దగ్గరకి కూడా రానివ్వరు. పెట్స్ పెంచే వారిని సైతం దుర్భాషలాడుతుంటారు. ఇక పెట్స్ ప్రియులు కూడా వాళ్లు ఎక్కడికి వెళితే అక్కడికి వాటిని తీసుకువెళుతుంటారు. ఈ క్రమంలోనే నోయిడాకు చెందిన ఓ మహిళ లిప్ట్ లో తన కుక్కను తీసుకుని వెళుతోంది.
అందులోనే ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అది నచ్చలేదు. కుక్కల్ని కూడా లిప్ట్ లోకి తీసుకువస్తారా అని మహిళతో గొడవపడ్డారు. అసలే దానికో పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మహిళలకు కుక్క అనేసరికి చిర్రెత్తుకొచ్చి ఉంటుంది. పైగా లిప్ట్ లోకి పర్మిషన్ లేదనే సరికి అగ్గిమీద గుగ్గిలం అయింది. ఆయనతో గొడవపడింది. ఐఏఎస్ అధికారికి కూడా ఒళ్లు మండిపోయి ఉంటుంది.లాగి ఒక్కటిచ్చుకున్నారు. లిప్ట్ బయటకు వెళ్లి మరీ పోట్లాడుకున్నారు. ఇదంతా సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో, మహిళ అరుస్తూ IAS అధికారి ఫోన్‌ను లాక్కొనడంతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. చుట్టు పక్కల వారొచ్చి గొడవ సద్దుమణిగేలా చూశారు.
ON CAM: Noida: Retired IAS Officer Slaps Woman After Fight Over Carrying Pet Dog in Lift.#ViralVideo #Noida pic.twitter.com/xtL1VC7oln
— TIMES NOW (@TimesNow) October 31, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com