Rimi Sen: బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి మెగాస్టార్ హీరోయిన్..

Rimi Sen: బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి మెగాస్టార్ హీరోయిన్..
Rimi Sen: ముందుగా సినీ పరిశ్రమలో కాస్త పేరు సాధించిన తర్వాత.. చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడం సహజమే.

Rimi Sen: ముందుగా సినీ పరిశ్రమలో కాస్త పేరు సాధించిన తర్వాత.. చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడం సహజమే. పైగా వారు కూడా ఓ పార్టీలో నచ్చకపోతే మరో పార్టీకి షిఫ్ట్ అయ్యే స్వేచ్ఛ కూడా ఉంది. ఈ మధ్య హీరోలతో పోలిస్తే.. హీరోయిన్లే ఎక్కువగా రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మెగాస్టార్ సరసన నటించిన ఓ బాలీవుడ్ నటి కూడా తాజాగా పార్టీ మారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రిమీ సేన్.. ఈ హీరోయిన్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తులేకపోయినా.. చిరంజీవి 'అందరివాడు' సినిమాలో హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపడతారు. పలు తెలుగు చిత్రాల్లో నటించి, అందరివాడుతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటి రిమీ సేన్. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి 2016లో సినిమాల నుండి పూర్తిగా బ్రేక్ తీసుకుంది రిమీ సేన్.


సినిమాల నుండి దూరమయిన ఒక సంవత్సరం తర్వాత రిమీ సేన్.. బిజేపీలో చేరింది. అక్కడ ఎన్నికల ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొనేది ఈ నటి. తాజాగా రిమీ.. బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి మారింది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్వయంగా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రిమీ మార్పు కోసం పార్టీ మారినట్టు ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story