PCC Chief : పీసీసీ అధ్యక్షుడి ఇంట్లో దొంగల బీభత్సం..

PCC Chief :  పీసీసీ అధ్యక్షుడి ఇంట్లో దొంగల బీభత్సం..
X
సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు..

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి (PCC Chief ) ఇంట్లో దొంగలు బీభత్సం సృంష్టించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇండోర్‌లోని రాజేంద్రనగర్‌ జిజల్‌పూర్‌లో ఉన్న పీసీసీ చీఫ్‌ జీతూ పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన అరడజను మందికి పైగా దొంగలు.. కరెంట్‌ బంద్‌ చేసి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటిలోని ఆఫీస్‌లో ఉన్న డ్రాలు, లాకర్లను బద్దలు కొట్టారు. విలువైన వస్తువులు, మొబైళ్లను వదిలేసి మిగిలిన వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే విలువైన వస్తువులను వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖాలు కనిపించకుండా మాస్కులు వేస్తున్న దొంగలు పటేల్‌ ఇంటితోపాటు సమీపంలోని చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌ (CMO) రాజ్‌కుమార్‌ ఠాకూర్‌, మధ్యప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ (MPEB) ఆఫీసర్‌ నరేంద్ర దూబే ఇంట్లోనూ చొరబడ్డారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతంలో హల్‌చల్‌ చేశారు. మరో మూడు ఇండ్లలోకి ప్రవేశించిన దొంగలు కిటికీల మెష్‌లు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. కంరెంటు బంద్‌ చేయడంతో ఆ ప్రాంతంలో పూర్తిగా అంధకారం నెలకొంది. అయితే పట్వారీ ఇంట్లో ప్రవేశించినప్పుడు వెలుపల ఉన్న కెమెరాల్లో చోరులు రికార్డయ్యారు. కనిపించకుండా మాస్కులు వేసుకుని ఉన్నారు.

తెల్లవారుజామున 2 గంటలకు బిజల్‌పూర్‌లోకి అడుగుపెట్టిన దొంగలు, 4.30 గంటలకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ముఠాను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు

Tags

Next Story