J&K Assembly: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఆర్టికల్ 370 బ్యానర్‌ను అసెంబ్లీలో ప్రదర్శించడం పట్ల బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇతెహద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్.. అసెంబ్లీలో ఆర్టికల్ 370 బ్యానర్‌ను ప్రదర్శించాడు. అయితే ఆ బ్యానర్‌ను ప్రదర్శించడం పట్ల ప్రతిపక్ష నేత సునిల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు ఒకర్ని ఒకరు తోసుకున్నారు. దీంతో అసెంబ్లీని వాయిదా వేశారు. అధికార, విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో దూషణలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అధికరణ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్‌ను సభలో ప్రదర్శించటం వల్ల ఈ వివాదం మొదలైంది. ప్రతిపక్ష నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు బ్యానర్‌ను లాక్కునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి దాడులు చేసుకున్నారు. అనంతరం సభలోకి వచ్చిన మార్షల్స్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటికి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను గట్టిగా తోయటంతో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కిందపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com