Rajkot : పెళ్లి చేసి, గిఫ్ట్‌లు ఇస్తామన్నారు.. తీరా చూస్తే

Rajkot : పెళ్లి చేసి, గిఫ్ట్‌లు ఇస్తామన్నారు.. తీరా చూస్తే
X
ఉడాయించిన మోసగాళ్లు.. పెళ్లిళ్లు చేసిన పోలీసులు

సామూహిక వివాహాలు జరిపిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు చొప్పున వసూలుచేసిన ఓ సంస్థ తీరా ముహూర్త సమయానికి పత్తా లేకుండా పోయింది. ఎన్నో ఆశలతో కల్యాణవేదిక వద్దకు వచ్చిన కొత్త జంటలకు తీవ్ర నిరాశ ఎదురైంది. నిర్వాహకులకు ఫోన్లు చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. దీంతో ఏమిచేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఉదంతం వెలుగు చూసింది. మోసగాళ్ల మాటలకు బోల్తాపడిన 28 జంటలు పెళ్లికి నమోదు చేసుకున్నాయి. చివరకు పోలీసులు దగ్గరుండి వీరి పెళ్లిళ్లు జరిపించారు. కొత్త జంటలను మోసగించిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాధికా భరాయ్‌ తెలిపారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కొందరు వ్యక్తులు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేసి.. అందర్నీ నిండా ముంచేశారు. తాము సామూహిక పెళ్లిళ్లు చేస్తామని.. ఆ పెళ్లిళ్లకు హాజరైన కొత్త జంటకు భారీగా బహుమతులు కూడా ఇస్తామని చెప్పారు. ఇక కొందరికి కట్నకానుకలు కూడా అందిస్తామని నమ్మించారు. అది నిజమని భావించిన కొన్ని కుటుంబాలు.. వారికి కొంత డబ్బు కూడా చెల్లించుకున్నాయి. ఈ డబ్బు అంతా పోగేసుకున్న కొందరు దుండగులు.. పెద్దగా ఖర్చు లేమీ లేకుండానే తమ పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని భావించారు. ఈ క్రమంలోనే రాజ్‌కోట్ చుట్టపక్కల గ్రామాల్లోని కొన్ని కుటుంబాలను నమ్మించి వారి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు వసూలు చేశారని బాధితులు వెల్లడించారు.

తామే దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేసి, కానుకలు కూడా ఇస్తామని తమను నమ్మించారని.. ఏకంగా 28 జంటలు పెళ్లికి సిద్ధమై.. ఆ రోజున పెళ్లి మండపానికి చేరుకున్నారు. అయితే ఆ తేదీన అక్కడ ఎలాంటి సామూహిక పెళ్లి ఏర్పాట్లు కనిపించలేదు. దీంతో వారు సదరు నిర్వాహకులకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో తాము మోసపోయామని గుర్తించారు. ఈ ఘటనతో అవాక్కయిన ఆ కుటుంబాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వచ్చిన జంటలకు పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను వారు తీసుకున్నారు. అయితే అప్పటికే కొన్ని జంటలు.. అక్కడి నుంచి వెళ్లిపోయి దగ్గర్లో ఉన్న దేవాలయాలు, ఫంక్షన్ హాల్‌లకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక మిగిలిన 6 జంటలకు పోలీసులు పెళ్లిళ్లు జరిపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన స్థానిక ఏసీపీ రాధికా భరాయ్‌.. బాధ్యులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags

Next Story