S Somanath: ఇస్రోకు కొత్త ఛైర్మన్.. శివన్ ప్లేస్‌లో సోమనాథ్..

S Somanath: ఇస్రోకు కొత్త ఛైర్మన్.. శివన్ ప్లేస్‌లో సోమనాథ్..
S Somanath: ఇస్రో కొత్త ఛైర్మన్ గా అంతరిక్ష శాఖ కార్యదర్శి రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు.

S Somanath: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో కొత్త ఛైర్మన్ గా అంతరిక్ష శాఖ కార్యదర్శి రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియామించారు. మూడేళ్ల కాలానికిగానూ సోమనాథ్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సోమనాథ్‌ ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

కేరళకు చెందిన ఎస్.సోమనాథ్.. కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో యూజీ డిగ్రీ, భారతదేశం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1985లో సోమనాథ్ ఇస్రోలో చేరారు. కేరళ శాస్త్రవేత్తలు జి.మాధవన్ నాయర్, డాక్టర్ కె.రాధాకృష్ణన్ 2003 నుంచి 2014వరకు అంతిరక్ష సంస్థకు నాయకత్వం వహించారు. ఎస్.సోమనాథ్.. అగ్రస్థానికి చేరుకున్న మూడో మలయాళీ కావడం విశేషం.

సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరు. ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయనది కీలక పాత్ర. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్‌లో ప్రత్యేకత. కెరీర్ తొలినాళ్లలో PSLV ఇంటిగ్రేషన్ టీమ్ లీడర్ గా పనిచేసిన సోమనాథ్.. GSLV Mk-III లాంచర్ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు.

Tags

Next Story