Makara Jyothi: సంక్రాంతి పర్వదినాన శబరిమలలో దర్శనమిచ్చిన మకర విళుక్కు

సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు. మకర జ్యోతి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. చుట్టు పక్కల అడవుల్లో ఉన్న భక్తులు కూడా దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ స్వామియే శరణం అయ్యప్పా అంటూ నామస్మరణతో మార్మోగుతోంది.
శబరిమల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు వద్ద కొండపై మకర జ్యోతి కనిపిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ జ్యోతి సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపటికే కనిపిస్తుంది. ఇది మూడుసార్లు కనిపిస్తుంది, ఆ తరువాత అదృశ్యం అవుతుంది.
జ్యోతి దర్శనం కోసం నాలుగు రోజుల క్రితమే కొండపైకి భక్తులు వచ్చారు. కొండపై 1.5లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని మంగళవారం అధికారులు అంచనా వేశారు. సోమవారమే 64, 194 మంది భక్తులు కొండపైకి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా చుట్టు పక్కల కొండలపైన కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇదిలా ఉంటే మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com